HomeTelugu Trendingసముద్రంలో.. 'సలార్' క్లైమాక్స్ ..! వైరల్‌

సముద్రంలో.. ‘సలార్’ క్లైమాక్స్ ..! వైరల్‌

interesting news on Salaar
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. తాజాగా ఈ సినిమా క్రైమాక్స్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ నుంచి ఇటీవల వచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో ‘సలార్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్ 2’ సినిమాలో క్లైమాక్స్ కి కథ సముద్రం పైకి చేరుకుంటుంది. అలాగే ‘సలార్’ సినిమా క్లైమాక్స్ కూడా సముద్రంపైకి చేరుకుంటుందని అంటున్నారు. సముద్రం లోపల ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్‌. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ముఖ్యమైన పాత్రలలో జగపతిబాబు .. పృథ్వీరాజ్ సుకుమారన్ .. ఈశ్వరీరావు కనిపించనున్నారు. జగపతిబాబు పాత్ర చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu