‘బాహుబలి’ మాదిరిగానే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మొదటిసారి నోరు విప్పిన రాజమౌళి

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మొదలై ఇన్నాళ్లు కావొస్తున్నా ఆయన ఏ రోజు సినిమా గురించి మీడియా ముందు ప్రస్తావించలేదు. కనీసం సినిమా ఏ స్థాయిలో ఉంటుందో కూడా చెప్పలేదు.

అటువంటిది హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ 2019లో పాల్గొన్న ఆయన ఈ సినిమా కూడా బాహుబలి మాదిరిగానే ఇండియా మొత్తం చూడదగిన సినిమా అని అన్నారు. ఆయన మాటల్ని బట్టి తెలుగు పరిశ్రమ నుండి త్వరలో మరో అద్భుతం ఇండియాకు పరిచయం కానుందని అర్థమవుతోంది. ఇకపోతే ఈ సినిమాను 150 కోట్ల వ్యయంతో దానయ్య నిర్మిస్తున్నారు.