HomeTelugu Trendingప్రభాస్ పక్కన యానిమల్ స్టార్!

ప్రభాస్ పక్కన యానిమల్ స్టార్!

animal star tripti

Tripti Dimri: రెబల్ స్టార్ ప్రభాస్‌తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిర్ట్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తృప్తి దిమ్రికి స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా యానిమల్ మూవీతో హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

యానిమల్ మూవీలో కీలక పాత్ర పోషించిన తృప్తి దిమ్రికి స్పిరిట్ మూవీలో అవకాశం ఇస్తున్నాడట. యానిమల్ మూవీలో జోయా అనే పాత్రలో రెచ్చిపోయి నటించింది తృప్తి దిమ్రి. రణ్‌బీర్ కపూర్‌తో ఓ సీన్‌లో రొమాన్స్ పండించిన తృప్తి దిమ్రి అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రభాస్ స్పిరిట్ మూవీని రూ400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ పెద్దగా ఏ విషయాలూ బయటకు రాలేదు. సలార్, కల్కి 2898 ఏడీ మూవీతో బిజీగా ఉన్న ప్రభాస్.. తర్వాత స్పిరిట్ చేయనున్నాడు.

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పక్కన తృప్తి దిమ్రి ఛాన్స్ కొట్టేయడం మామూలు విషయం కాదు. నిజానికి యానిమల్ మూవీలో పాత్ర కోసం కూడా తృప్తిని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా.

స్పిరిట్ మూవీలో తృప్తి పాత్ర ఏమిటో స్పష్టత రాలేదు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. యానిమల్ మూవీ కంటే ముందు తృప్తి దిమ్రి.. మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్నూలాంటి సినిమాలు చేసింది. యానిమల్ తర్వాత తృప్తికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu