ఐటెమ్ సాంగ్ అనేసరికి కోపం వచ్చేసింది!

kajal1

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తన సత్తాను చాటుతూనే ఉంది. ఈ మధ్య కెరీర్ లో ఫ్లాప్స్
వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం రావడం తగ్గలేదు. వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది.
ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జనతాగ్యారేజ్’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నటించే
ఛాన్స్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. సాంగ్ సిట్యుయేషన్ నచ్చడంతో వెంటనే అంగీకరించింది.
అయితే రీసెంట్ గా ఓ మీడియా ప్రతినిధి ఇలాగే కొత్తగా ఐటెమ్ సాంగ్స్ లో నటిస్తున్నారా..?
అని అడిగారు. ఐటెమ్ సాంగ్ అనొద్దని.. స్పెషల్ సాంగ్ అంటే బావుంటుందని తన అసహనాన్ని
వ్యక్తం చేసింది. కథలో ఆ పాటకు ప్రాముఖ్యత ఉండడం వలనే నటించానని సమాధానమిచ్చింది.
ప్రస్తుతం చాలా మంది కాజల్ ను స్పెషల్ సాంగ్స్ కోసం సంప్రదిస్తున్నారట. ఇకపై ఇలాంటి
పాటల్లో నటించకూడదని అమ్మడు నిర్ణయం తీసుకుందని టాక్.

CLICK HERE!! For the aha Latest Updates