HomeTelugu Trendingజబర్దస్త్‌ షోలో కరోనా కలకలం..

జబర్దస్త్‌ షోలో కరోనా కలకలం..

7 4
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. తెలంగాణలోని రోజురోజుకీ విపరీతంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలువురు టీవీ స్టార్స్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పలు సీరియల్స్ షూటింగ్స్‌ కూడా రద్దు చేశారు.

ఇప్పుడు జబర్దస్త్‌ షోలో కూడా కరోనా కలకలం రేగిందని సమాచారం. ఇప్పటికే జబర్ధస్త్‌ రెండు వారాలకు చెందిన ఎసిపోడ్స్ ప్రసారం అయ్యాయి. తాజాగా జబర్ధస్త్ టీమ్‌లో కూడా కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటికే హైపర్ ఆది టీమ్‌లో ఒక మెంబర్‌కు కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. షూటింగ్‌ల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కరోనా దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. కాగా ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేక ఆది టీమ్‌లోని ఒక మెంబర్‌ .. టెస్టుకు వెళ్తే కరోనా పాజిటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో అతనికి కలిసి పనిచేసిన హైపర్ ఆది టీం మెంబర్స్ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక జబర్దస్త్ షూటింగ్‌ని కూడా మధ్యలోనే నిలిపివేసినట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu