ప్రత్యేక హోదాపై కేసీఆర్‌ వ్యాఖ్యలపై జగన్‌ రియాక్షన్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం హర్షణీయమని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం కోసం సహకరిస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతించాలని అభిప్రాయపడ్డారు. కానీ చంద్రబాబునాయుడు ఈ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని తప్పుపట్టారు. ఎన్నికలు జరిగితే తనకు డిపాజిట్లు కూడా రావని బాబుకి తెలుసా అని ఈ సందర్భంగా జగన్‌ అన్నారు.