అంజలి బాయ్ ఫ్రెండ్ ఓపెన్ అయ్యాడు!

తెలుగమ్మాయి అంజలి టాలీవుడ్ లో కంటే తమిళంలోనే బాగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే గత నాలుగేళ్లుగా అంజలి, నటుడు జై తో ప్రేమలో ఉందనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ జంట ఏనాడూ వారి బంధం గురించి ఎక్కడ పెదవి విప్పలేదు. రీసెంట్ గా దోశ ఛాలెంజ్ లో జై, అంజలి కోసం దోశ వేయడంతో అందరూ వీరి మధ్య రిలేషన్ కన్ఫర్మ్ అని వార్తలు ప్రచురించారు. తాజాగా ఈ విషయంపై జై ఓపెన్ అయ్యాడు.
 
”అవును.. అంజలి అంటే నాకు చాలా ఇష్టం. తనకు కూడా నేనంటే ఇష్టమే. మా మధ్య స్నేహంతో పాటు ఒకరిపట్ల మరొకరికి మంచి అవగాహన ఉంది. అంజలి మా ఇంటికి కూడా వస్తూ ఉంటుంది. తను చేసే వంటకాలు మా నాన్నగారు ఎంతో ఇష్టంతో తింటారు. మా ఇంట్లో వాళ్ళకు కూడా తనంటే ఇష్టమే” అంటూ తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ చెప్పేశాడు ఈ యంగ్ హీరో. మరి పెళ్లి సంగతి ఏంటని..? ప్రశ్నించగా.. అప్పుడే పెళ్లి గురించి ఆలోచించలేదని ఇండస్ట్రీలో తన కంటే సీనియర్ హీరోలు చాలా మంది ఉన్నారని వారు చేసుకున్న తరువాత మా పెళ్లి గురించి ఆలోచిస్తామని చెప్పారు. మరి ఈ విషయంపై అంజలి ఎలా రియాక్ట్ అవుతుందో.. చూడాలి!