‘జల జల పాతం’ సాంగ్‌ మేకింగ్‌ వీడియో

మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టీ హీరో హీరోయిన్‌లు నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం వంద కోట్లపైగా గ్రాస్‌ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన నెలరోజుల తర్వాత నుంచి ఉప్పెన టీం సినిమాలోని డిలీటెడ్‌ సీన్స్‌, పాటల మేకింగ్‌ వీడియోలను రిలీజ్‌ చేస్తూ ప్రేక్షకులలో అసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ మూవీ రోమాంటిక్‌ సాంగ్‌ ‘జల జల పాతం నువ్వు..’ మేకింగ్‌ వీడియోను షేర్‌ చేసింది చిత్ర యూనిట్‌.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. శ్రేయాఘోషల్, జాస్ ప్రీత్ జాజ్ ఆలపించిన ఈ పాట ఫుల్‌ వీడియోను ఇటీవల చిత్ర యూనిట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలై గంటల వ్వవధిలోనే లక్షల్లో వ్యూస్‌ సంపాదించింది.

CLICK HERE!! For the aha Latest Updates