HomeTelugu Trendingమనోజ్‌ ఆసక్తికర ట్వీట్స్‌.. వైరల్‌

మనోజ్‌ ఆసక్తికర ట్వీట్స్‌.. వైరల్‌

manchu manoj tweet viral 1

మంచు మనోజ్‌ తన అన్న మంచు విష్ణు గొడవకు సంబంధించిన నిన్న వీడియో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. మనోజ్‌ అనుచరుడు సారథిపై విష్ణు చేయిచేసుకోవడం, దాంతో పాటుగా ఇండ్లలోకి వచ్చి మా వాళ్లను, బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇదీ ఇక్కడి పరిస్థితి అంటూ మనోజ్‌ వీడియోలో చెప్పుకురావడం పెద్ద సంచలనమే రేపింది.

మథ్యలో మెహన్‌బాబు ఎంట్రీ ఇచ్చి..ఆ వీడియో డిలీట్‌ చేయించాడు. అయితే అప్పటికే ఆ వీడియో వైరల్‌ అయిపోయింది… దీనిపై స్పందిచన మంచు విష్ణు.. మనోజ్‌ చిన్నవాడు.. ఏమీ తెలియదు.. అన్నదమ్ములు మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలే అంటూ కవర్‌ చేశాడు.

తాజాగా మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో ఆసక్తికర ట్వీట్స్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ‘కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసి చూడనట్టు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే’, ‘క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు’ అంటూ రెండు కోట్‌లను షేర్‌ చేస్తూ ‘మీరు బ్రతకండి, ఇతరులను కూడా బ్రతకనివ్వండి’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మనోజ్‌ ఇటీవలే భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం మోహన్‌బాబుకు, విష్ణుకు అస్సలు ఇష్టం లేదని.. అందుకే మనోజ్‌ వివాహం సోదరి మంచు లక్ష్మి తన నివాసంలోనే అంతా తానై దగ్గరుండి జరిపించిందంటూ ప్రచారం జరిగింది.

వివాహ వేడుకలో కూడా మంచు విష్ణు దంపతులు కొంచెం దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంతో మంచు కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు అంతా మాట్లాడుకున్నారు. ఇక నిన్నటి వీడియోతో అది నిజమే అని క్లారిటీ వచ్చేసింది. గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్‌ ఇటీవలే వాట్‌ ది ఫిష్ అనే సినిమాను ప్రకటించాడు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu