HomeTelugu Trendingపొలిటికల్ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌

పొలిటికల్ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌

JR ntr about active politic
టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పొలిటికల్‌ ఎంట్రీపై తాజాగా త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. టీడీపీకి చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల్సిందేనంటూ త‌ర‌చూ వినిపించే డిమాండ్ల నేప‌థ్యంలో దానిపై తార‌క్ తాజాగా చెప్పిన మాట ప్రాధాన్యం సంత‌రించుకుంది. తాను రాజ‌కీయాల్లోకి రావాల‌నుకోవ‌డం లేద‌న్న భావ‌న వినిపించేలా తార‌క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఆయన ఇటీవలే ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. ‘నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట నుంచి దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. ఫ్యూచర్ అంటే ఐదేళ్లు తర్వాత, పదేళ్ల తరువాత ఉంది అని అనుకొనే మనిషిని కాను.. భవిష్యత్ అంటే నా నెక్స్ట్ సెకన్ ఏంటి అనేది ఆలోచించే మనిషిని. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పని ఉంది. నేను అందులోనే ఉండాలనుకుంటున్నాను.’ అని చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి అభిమానులకు తాను పాలిటిక్స్ లోకి రాను క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ గా అందాయి.

అల్లు అర్జున్‌, ధనుష్ క్రేజీ కాంబోలో కొరటాల మూవీ!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!