HomeTelugu Big Storiesఏపీ నెక్స్ట్‌ సీఎం అంటూ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీ

ఏపీ నెక్స్ట్‌ సీఎం అంటూ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీ

JR ntr flex viral
టాలీవుడ్ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గతంలో తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే చాలా కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారానికి రాలేదు. అయినప్పటికీ రాజకీయాలకు సంబంధించిన చర్చల్లో జూనియర్ ప్రస్తావన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. టీడీపీ తెలంగాణ బాధ్యతలను తారక్ కు ఇవ్వాలనే డిమాండ్లు కూడా గతంలో వినిపించాయి. తారక్ ఫాన్స్‌ మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.

మరోవైపు తారక్ కు సంబంధించిన ఓ ఫ్లెక్సీ ప్రకాశం జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ ఎర్రగొండపాలెంలో ఒక అభిమాని ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఈ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు స్థానిక టీడీపీ నేతల ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ ఫ్లెక్సీపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!