HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-7: విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా!

బిగ్‌బాస్‌-7: విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా!

 

telugu Bigg boss 7 winner pతెలుగు బిగ్‌బాస్-7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. బిగ్ బాస్-7 టైటిల్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ గెలుచుకున్నాడు. అయితే ఆయనకు వచ్చిన ప్రైజ్ మనీ ఎంతనేది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. విన్నర్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు. కానీ, అందులో కోత విధించడం జరిగింది. బిగ్ బాస్ 7 తెలుగు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు అయినప్పటికీ వాటిలో నుంచి ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు టాప్ 4 కంటెస్టెంట్ గా తీసుకెళ్లిపోయాడు. దీంతో ప్రైజ్ మనీ రూ. 35 లక్షలకు తగ్గింది. అలాగే జోయాలుకాస్ వారు ఇచ్చే నగల విలువ రూ. 15 లక్షలు. వీటితోపాటు బ్రీజా కారు విలువ సుమారు రూ. 12 లక్షలు అని సమాచారం. ఇవన్ని కలుపుకుంటే పల్లవి ప్రశాంత్‌కు వచ్చింది రూ. 62 లక్షలు.

ఇప్పటివరకు బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్‌కు రూ. 80 లక్షలు వస్తుందని టాక్ నడిచింది. కానీ, విజేతగా నిలిచిన ప్రశాంత్‌కు రూ. 62 లక్షలు రానున్నాయి. వాటిలో రూ. 35 లక్షలను ప్రశాంత్ ఇది వరకు చెప్పినట్లుగానే పేద రైతులకు అందించనున్నట్లు స్టేజీపై చెప్పాడు. ఇక కారును తండ్రికి, జోయాలుకాస్ నగలను తల్లికి ఇస్తున్నట్లు తెలిపాడు బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్.

telugu Bigg boss 1

రైతుబిడ్డగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. హౌస్‌లో హీరో శివాజీ తనకు సపోర్ట్‌ చేశాడు. తనకు నచ్చడంతో, మిగతా వారు చిన్నచూపు చూస్తున్నారని కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రశాంత్‌ను అక్కున చేర్చుకున్నాడు శివాజీ. తనకు ఎప్పుడూ గైడెన్స్ ఇస్తూ, తప్పొప్పులు చెబుతూ శివాజీ ఎంకరేజ్ చేశాడు. ఎంత ఎంకరేజ్ చేసిన టాస్క్‌లు మాత్రం స్వయంగా ఆడి గెలిచాడు. బిగ్ బాస్ చరిత్రలోనే వేగంగా టాస్క్‌లు ఆడి అత్యంత ఫాస్టెట్ గేమర్‌గా రికార్డుకెక్కాడు ప్రశాంత్. ఫైనల్‌గా బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా నిలిచి తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు గెలుచుకున్నాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu