పాల్‌ పోటీ చేసేది ఇక్కడ నుండే..

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నర్సాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇవాళ స్వయంగా ప్రకటించారు. 22న నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. పార్టీ అభ్యర్థుల తొలి జాబితా 20వ తేదీన విడుదల చేస్తానని పాల్‌ తెలిపారు. టీడీపీ, వైసీపీ అవినీతి పార్టీలన్న పాల్‌.. హెలికాప్టర్‌ గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని అందించాలని కోరారు.