చరణ్, సుక్కుల సినిమాకు ఎంట్రీ లేదు!

రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు ఉదయం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మీడియా వారిని కూడా ఇన్వైట్ చేయలేదు. చరణ్, సుకుమార్ లకు సంబంధించిన అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిర్వహించినట్లు సమాచారం.

చిరంజీవి, సురేఖా, ఉపాసనాలు ఈ వేడుకకు హాజరయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమను తప్పించడంతో ఇప్పుడు సమంతను ఆ స్థానంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సమంత కూడా అంగీకారం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి రత్నవేలు ఫోటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అసెట్స్ కానున్నాయి. సుకుమార్ ఓ అందమైన ప్రేమ కథను గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కించనున్నారు.