కేఏ పాల్‌ బయోపిక్‌.. హీరో ఎవరో తెలుసా!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ గత ఏపీ ఎన్నికల్లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అన్ని పార్టీలను మట్టి కరిపిస్తానని శపథం చేసిన పాల్ ఎన్నికల తరవాత ఇతని జాడలేదు. అయితే అప్పుడు ఆయన చేష్టలు, మాటల ద్వారా జనం బాగా ఎంటర్‌టైన్ అయ్యారు. అందుకే సినిమా వాళ్ళ దృష్టి పాల్‌ మీద పడింది. ఆయన బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నారట ఒక కొత్త దర్శకుడు. ఇందులో పాల్ పాత్రను ప్రముఖ నటుడు సునీల్ చేయనున్నామని, ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారికంగా ప్రకటన అందాల్సి ఉంది.