నా బయోపిక్‌లో నేనే హీరో: విరాట్‌ కోహ్లీ


సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తుంది. ప్రముఖుల జీవిత కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇక టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ల్లో అతను ఒకడు. క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన కోహ్లీ బయోపిక్ కూడా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు డైరెక్టర్లు.

ఇప్పటికే సచిన్, ధోని, బయోపిక్ లు వచ్చాయి. కపిల్ దేవ్ బయోపిక్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. త్వరలో విరాట్ కోహ్లీ బయోపిక్ రాబోతోందట.. ఈ మేరకు ట్విట్టర్ లో కోహ్లీ లైవ్ చాట్ లో ఆసక్తికరంగా స్పందించాడు. తన బయోపిక్ తీస్తే తనే హీరోగా ఉంటానని.. అయితే హీరోయిన్ గా తన భార్య అనుష్క శర్మ అయితే ఓకే చెబుతానని షరతు పెట్టాడు. దీంతో కోహ్లీ బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అంటున్నారు. మరి ఈ అవకాశాన్ని ఏ దర్శకుడు దక్కించుకుంటాడో చూడాలి. .