HomeTelugu Trendingయంగ్‌ హీరోయిన్‌కి తల్లిగా కాజల్‌!

యంగ్‌ హీరోయిన్‌కి తల్లిగా కాజల్‌!

Kajal as Mother in balakri
టాలీవుడ్‌ లో ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుస స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చందమామ. అయితే 2020లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని కాజల్ పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత కాస్త సినిమాలకు దూరంగా ఉంది. 2022లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్నాళ్ల పాటు బాబుతో హాయిగా గడిపింది. ఇప్పుడు కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోందట. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా అనిల్ రావుపూడి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న ఎన్బీకే 108 సినిమా కోసం కాజల్ ను చిత్ర బృందం కలిసినట్లు తెలుస్తోంది.

Kajal 1

అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాకు ఇంకా సంతకం చేయలేదట. కానీ ఆమె ఈ సినిమాలో నటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్బీకే 108లో శ్రీలీల కీలక పాత్రలో నటించబోతోంది. ఆమెకు తల్లి పాత్రలోనే కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని మూవీ యూనిట్‌ భావిస్తోందట. స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న కాజల్‌ తల్లి పాత్రకు ఒప్పుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కాజల్‌ ఈ సినిమాకు సైన్ చేసిందంటే.. శ్రీలీల తల్లి పాత్రలో కనిపిస్తుంది.

బాలయ్య 108వ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా… షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. తొలిసారిగా అనిల్ రావిపూడి మరిము బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలయ్య బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!