HomeTelugu Trendingకళ్యాణ్‌ దేవ్‌కి కరోనా

కళ్యాణ్‌ దేవ్‌కి కరోనా

Kalyan Dev tested corona poమెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కళ్యాణ్‌దేవ్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా కల్యాణ్‌దేవ్‌ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘స్వల్ప లక్షణాలు కనిపించడంతో బుధవారం కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను ఆస్పత్రిలోనే క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తా’ అని ఆయన పేర్కొన్నారు. కళ్యాణ్‌ పెట్టిన పోస్ట్‌ పై స్పందించిన నాగబాబు.. ‘నువ్వు త్వరగా కోలుకోవాలి. కోలుకుంటావు అని ఆశిస్తున్నా’ అని రిప్లై ఇచ్చారు. నటి అవికాగౌర్‌ స్పందిస్తూ.. ‘ఓ మై గాడ్‌!! జాగ్రత్తగా ఉండండి’ అని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!