జాన్వీతో మహానటి

టాలీవుడ్ లో మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఒక్కసారిగా పాపులర్ అయింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అటు కోలీవుడ్ లోను సినిమా అవకాశాలు వరసగా దక్కించుకున్న కీర్తి సురేష్… తెలుగులో మాత్రం మహానటి తరువాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో బోణి కపూర్ నిర్మిస్తున్న ఓ సినిమాలో నటించేందుకు ముంబై వెళ్ళింది.

అక్కడ జాన్వీ కపూర్ తో కలిసి ఫోటో దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. టాలీవుడ్ లో చాలా క్యూట్ గా కనిపించిన కీర్తి సురేష్ ఒక్కసారిగా అల్ట్రా మోడ్రన్ లుక్ లో అదిరిపోయేవిధంగా కనిపించి కనువిందు చేసింది.