40రోజులు మేకప్‌ ఆర్టిస్టుగా ట్రెనింగ్‌ తీసుకున్న కమల్‌!

కమల్‌హాసన్‌ కేవలం నటుడిగానే కాదు.. కొరియోగ్రాఫర్‌గా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా కూడా ఆయన సక్సెస్‌ అయ్యారు. మేకప్‌లో కూడా కమల్‌కి నైపుణ్యం ఉంది. మేకప్‌ విభాగంపై కూడా పట్టు సాధించడానికి శిక్షణ కూడా తీసుకున్నానని అంటున్నారు కమల్‌ హాసన్‌. ఆయన శిక్షణ తీసుకున్నది కూడా ఆస్కార్‌ విజేత దగ్గర కావడం విశేషం. ‘హాలీవుడ్‌ మూవీ ‘స్టార్‌ ట్రెక్‌-ఫస్ట్‌ కాంటాక్ట్‌’ అప్పుడు మేకప్‌ నిపుణుడు మైఖేల్‌ వేస్ట్‌మోర్‌ దగ్గర దాదాపు 40రోజులు మేకప్‌ ఆర్టిస్టుగా ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఆ సినిమాలో విచిత్రమైన ఆకారాల్లో వివిధ జీవులుంటాయి. మేకప్‌కి బాగా స్కోప్‌ ఉన్న సినిమా. అందుకే ఆ సినిమాకి పని చేశాను’ అంటూ మేకప్‌ గురించి తనకు ఉన్న ఆసక్తిని కమల్‌హాసన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.