HomeTelugu Trending'ధాకడ్' ట్రైలర్‌: తుపాకీతో దండయాత్ర చేస్తున్న.. కంగనా

‘ధాకడ్’ ట్రైలర్‌: తుపాకీతో దండయాత్ర చేస్తున్న.. కంగనా

3 9

వివాదాస్పద నటి ‘కంగనా రనౌత్’ ఈ మధ్యనే జడ్జిమెంటల్ హైక్యా సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఇప్పుడు కంగనా తన తదుపరి సినిమా కోసం తన అవతారాన్ని పూర్తిగా మార్చేసింది. కంగనా హీరోయిన్ గా నటిస్తోన్న తాజా చిత్రం ధాకడ్. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తాజాగా విడుదల చేశారు. ఇందులో గన్ పట్టుకుని నడుస్తున్న లేడీ డాన్ లా కనిపించింది కంగనా. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో కంగనా చేతిలో తుపాకీ పట్టుకొని దండయాత్రకు వెళుతున్నట్టు కనిపించారు. మెషీన్ గన్ తో కాల్పులు జరిపిన కంగనా తన మీద నెత్తుటి మరకలు పడగా ఆ మరకలను ఆమె నాలుకతో తుడుచుకునే సన్నివేశం జుగుప్స కలిగిస్తున్నా ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో తెలియచెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక ధాక‌డ్ సినిమాని సోహైల్ మాక్లాయ్ నిర్మిస్తుండగా రజ్నీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది మొదటిలో షూట్ మీదకి తీసుకువెళ్లి, వ‌చ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజర్ మీకోసం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu