
బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన తారలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో పార్లమెంటులో బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా స్పందించారు.
సినిమా ఇండస్ట్రీలో బాగుపడిన వారే అవసరం తీరాక ఆ పరిశ్రమను కించపరిచేలా మాట్లాడుతున్నారన్న జయాబచ్చన్ వ్యాఖ్యలపై కంగనా ఫైర్ అయిన సంగతి తెలిసిందే.అభిషేక్ బచ్చన్ ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆ బాధేంటో జయాబచ్చన్‌కు తెలిసేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే హీరోయిన్ ఊర్మిళనూ వివాదంలోకి లాగింది. ఆమెకు నటన రాదని, అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయడం మాత్రమే తెలుసని అంది. ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్‌స్టార్ అంటూ కించపరిచేలా మాట్లాడింది. ఇటీవల కంగనా తీరును ఊర్మిళ తప్పుబట్టింది. దీంతో కంగనా ఇలా రెచ్చిపోయిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.













