మనం పోరాడుదాం.. భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘మణికర్ణిక’ ఎన్నో వివాదాలు, మరెన్నో వాయిదాలు మొత్తానికి విడుదలకు సిద్దం అయింది. బ్రిటీష్‌ వారితో యుద్దం చేయడానికి ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత కష్టపడిందో.. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి కంగనా రనౌత్ కూడా అంతే కష్టపడ్డారు. మణికర్ణిక తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.

పూర్తి ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ ట్రైలర్‌లో దేశభక్తిని రేకెత్తించేలా ప్రతీ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మనం పోరాడుదాం..మన భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి.. మీ పోరాటం రేపటి గురించి నేటి కోసం కాదు వంటి సంభాషణలు కూడా అంతే పదునుతో ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్‌లో కంగనా విజృంభించారు. పోరాట సన్నివేశాల్లో కూడా కంగనా తన దూకుడును ప్రదర్శించారు. ఈ చిత్రానికి క్రిష్‌, కంగనా రనౌత్‌లు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.