‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ మొదటి భాగం టైటిల్‌ ఇదే..!

బాలకృష్ణ హీరోగా నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ ఎన్టీఆర్‌ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్‌, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింట్‌ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను బాలయ్య రెండు భాగాలుగా రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి భాగంలో ఎన్టీఆర్‌ సినీ జీవితం రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలను తెరకెక్కించనున్నారు. తాజాగా రిలీజ్‌ అయిన పోస్టర్‌ చూస్తే ఈ వార్తలు నిజమే అనే అనిపిస్తుంది. ఈ పోస్టర్‌ యన్‌.టి.ఆర్‌ టైటిల్‌తో పాటు కథానాయకుడు అనే ట్యాగ్‌ను జత చేశారు.

దీంతో యన్‌.టి.ఆర్‌ తొలి భాగం కథానాయకుడు గా రిలీజ్ కాబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. రెండో వారాల గ్యాప్‌లోనే రెండో భాగం కూడా రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే యన్‌.టి.ఆర్‌ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్‌ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.