
Karan Johar Sold K3G for $5000:
బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ తాజాగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన ప్రత్యేక సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను తన తండ్రి యష్ జోహర్తో కలసి 2002లో కాన్స్ మార్కెట్‌కు వెళ్లిన స్మృతులను పంచుకున్నాడు. అందులో ‘కభీ ఖుషీ కభీ గమ్ (K3G)’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
కేవలం $5,000కే అమ్మారు!
కరణ్ చెప్పిన ప్రకారం, 2002లో తన తండ్రి K3G సినిమా యూరోపియన్ రైట్స్‌ను కేవలం $5,000కు అమ్మారట. అప్పట్లో ఆ డీల్ గురించి తన తండ్రిని అడిగినప్పుడు, “ఇది తక్కువ అనిపిస్తోంది” అని అన్నాడట కరణ్. కానీ యష్ జోహర్ మాత్రం, “ఇది ఒక మొదలు, మన సినిమాలు బయట ప్రపంచానికి పరిచయం కావాలి” అని చెప్పారు. ఆ సమయంలో ఆయన భావనను అర్థం చేసుకోలేకపోయానంటూ కరణ్ గుర్తు చేసుకున్నాడు.
శారుఖ్, ఐశ్వర్య… 2002 స్పెషల్ ఇయర్!
ఆ ఏడాది కాన్స్‌లో దేవదాస్ సినిమా స్క్రీనింగ్, ఐశ్వర్యరాయ్ – శారుఖ్ ఖాన్ రెడ్ కార్పెట్‌పై వాకింగ్ చేసిన సందర్భాలు తనకు గుర్తున్నాయంటూ చెప్పాడు. “ఐశ్వర్యరాయ్ కెన్స్ క్వీన్‌లా మారిపోయింది. ఆమె ఎప్పుడెప్పుడూ వస్తుందా అని అంతర్జాతీయ మీడియా ఎదురు చూస్తుంటుంది” అని అన్నారు.
‘ది లంచ్‌బాక్స్’ వల్ల మారిన దృక్కోణం
2013లో బాంబే టాకీస్ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా తిరిగి కాన్స్‌కు వెళ్లినప్పుడు, అక్కడే గునీత్ మొంగ పరిచయం అయ్యిందని, అప్పుడే ‘ది లంచ్‌బాక్స్’ సినిమా చూసి, అదే భారతీయ ప్రేక్షకులకు అందించాలనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
ఇప్పటి కన్నా అప్పటిదే అసలైన ఆరంభం
కరణ్ చెప్పిన ఈ విషయాలు మనకు గుర్తు చేస్తున్నాయి – ప్రపంచానికి బాలీవుడ్‌ను పరిచయం చేసినది కేవలం భారీ బడ్జెట్ కాదు, సరైన సమయంలో తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలే.
ALSO READ: అదుర్స్ నటుడుMukul Dev అకాల మరణం!













