కరీనా కపూర్‌ రెండో కొడుకు ఫొటో వైరల్‌

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ కరీనా కపూర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా కొడుకుని భుజంపై ఎత్తుకొని ముఖం కనిపించకుండా ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అంతేగానీ ఇప్పటి వరకు తన చిన్న కుమారుడి ఫొటోను పూర్తిగా చూపించలేదు. తాజాగా కరీనా తండ్రి, నటుడు రణ్‌దీ‌ కపూర్‌ రెండో మనువడి పిక్‌ను షేర్‌ చేసేశాడు. సోమవారం రోజు ఇద్దరు పక్క పక్కనే ఉన్న ఇద్దరు శిశువుల క్లోజప్ ఫోటోను షేర్ చేశారు. వారిలో ఒకరు పెద్ద మనువడు తైమూర్‌ కాగా, మరొకరు చిన్న మనువడిగా తెలుస్తోంది. ఈ ఫొటోలో ఇద్దరు చిన్నారులు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ ఆయన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే కాసేపటికే రణధీర్‌ ఆ పోస్టును డిలీట్‌ చేశారు. కానీ అప్పటికే ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టేసింది. కొంతమంది స్క్రీన్‌షాట్‌ తీసుకొని రీపోస్టు చేస్తున్నారు. రణధీర్‌ పోస్టు ఎందుకు తొలగించారో తెలియదు కానీ పిక్‌లో ఉన్నది కరీనా రెండో కొడుకేనని నెటిజన్లు ఊహించుకుంటున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates