HomeTelugu Trendingసీక్వెల్స్‌ తో బిజీగా ఉన్న కార్తి!

సీక్వెల్స్‌ తో బిజీగా ఉన్న కార్తి!

Karthi announced sardar 2 1కార్తి హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 50 కోట్ల మార్కును టచ్ చేసింది. దగ్గరలో పోటీ ఇచ్చే సినిమాలేవీ లేకపోవడం వలన, ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగే అవకాశం ఉంది.

వాటర్ మాఫియా ఎలా విస్తరిస్తోంది .. భవిష్యత్ తరాలవారు మంచినీళ్ల కోసం ఎంతగా ఇబ్బంది పడతారు అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. లవ్, యాక్షన్, ఎమోషన్ చుట్టూ నడిచే ఈ కథలో, ప్రధానమైన పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. రాశి ఖన్నా – రజీషా విజయన్ హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాలో కార్తి ద్విపాత్రాభినయం చేశారు.

ఈ సినిమాకి సీక్వెల్ ఉండనుందనే విషయాన్ని ప్రకటిస్తూ .. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం కార్తి ‘పొన్నియిన్ సెల్వన్ 2, ఖైదీ 2’,  ‘సర్దార్ 2’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!