కార్తీ టెర్రరిస్ట్ లుక్!

కార్తీ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ‘చెలియా’ అనే రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో కార్తీ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. ఒకటి పైలట్ లుక్ కాగా మరొకటి టెర్రరిస్ట్ లుక్. ఇదంతా చూస్తుంటే గతంలో మణిరత్నం రూపొందించిన రోజా సినిమాలానే ఇది కూడా రొమాంటిక్ ప్రేమ కథకు దేశభక్తిని జోడించి సినిమా చేసినట్లు ఉన్నారని తెలుస్తోంది.

ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. తెలుగు, తమిళ బాషలతో పాటు ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. మొదటి నుండి కూడా తన పాత్రల్లో వైవిధ్యాన్ని కనబరిచే కార్తీ ఈ సినిమా తన కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు.