HomeTelugu Trendingకార్తికేయ '90 ఎంఎల్‌' టీజర్‌

కార్తికేయ ’90 ఎంఎల్‌’ టీజర్‌

4 20‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో సెన్సేషన్‌ సృష్టించిన కార్తికేయ తరువాత ఆ స్థాయిలో సక్సెస్‌ సాధించలేకపోయాడు. ఇటీవల గ్యాంగ్‌ లీడర్ సినిమాతో విలన్‌ పాత్రలో సక్సెస్‌ అయి ఈ యంగ్ హీరో ఇప్పుడు హీరోగా ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100 నిర్మాతలు తెరకెక్కించిన 90 ఎంఎల్‌ సినిమాలో దేవదాసు పాత్రలో అలరించనున్నాడు.

ఈ రోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు చిత్రయూనిట్‌. పూటకో 90 తాగే కేర్‌లేస్‌ కుర్రాడి పాత్రలో కార్తికేయ ఆకట్టుకున్నాడు. తన సొంత బ్యానర్‌ కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ సమర్పణలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శేఖర్‌ రెడ్డి ఎర్రా దర్శకుడు. కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తుండగా రవి కిషన్‌, రావూ రమేష్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!