కష్టాల ఊబిలో కల్యాణ్ రామ్!

హీరోగా తన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ఇక నిర్మాతగా సెటిల్ అయిపోదాం
సొంతంగా బ్యానర్ స్థాపించిన కల్యాణ్ రామ్ ను ‘పటాస్’ సినిమా హీరోగా ఓ ఇమేజ్ ను క్రియేట్
చేసింది. ఆ తరువాత వచ్చిన షేర్ సినిమా ఫ్లాప్ అయింది. అయితే దాని ఇంపాక్ట్ కల్యాణ్ పై
పెద్దగా పడలేదు. కానీ భారీ బడ్జెట్ తో నిర్మాతగా ఆయన రూపొందించిన ‘కిక్2’ డిజాస్టర్
కావడంతో కల్యాణ్ రామ్ కు అసలైన కష్టాలు మొదలయ్యాయి. కానీ ఆత్మస్థైర్యాన్ని వదలకుండా
సినిమాలు చేస్తున్నాడు. అయితే పూరీ జగన్నాథ్ తో కల్యాణ్ చేసిన ‘ఇజం’ సినిమా పూర్తిగా
అతన్ని ఊబిలోకి తోసేసింది. ఈ సినిమా కొందనికి ముందు బయ్యర్లు కూడా రాలేదు కానీ
ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అయ్యి .. జనతాగ్యారేజ్ కొన్న బయ్యర్లతో సినిమా కొనిపించాడు. అప్పటికే
సినిమాను లాస్ లో అమ్మారు. ఇక రిలీజ్ అయిన తరువాత దాదాపు 10కోట్ల వరకు నష్టం
వచ్చిందని టాక్. కొన్నాళ్ళ వరకు సినిమా నిర్మాణానికి దూరంగా ఉండాలని కల్యాణ్ భావిస్తున్నాడట.