కాటమరాయుడు సెన్సార్ పూర్తి!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. ఇటీవలే సినిమా టీం యూరప్ లో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగివచ్చారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తప్ప మిగిలిన వర్క్ మొత్తం పూర్తయింది. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ కు వెళ్ళింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పటికే పాటలు, పోస్టర్స్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. సినిమా నిడివి మొత్తం 144 నిమిషాలని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ జంటగా నటిస్తోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న రాయుడు ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉన్నాడు. 
 
 
Attachments