కాటమరాయుడు యాక్షన్ సీన్ లీకైంది!

ఈ మధ్య టాలీవుడ్ లో కొందరు ఔత్సాహికుల కారణంగా సినిమా రిలీజ్ కు ముందే సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేసేస్తున్నాయి. ఈ లీక్ ల బాధ బాహుబలి సినిమాకు కూడా తప్పలేదు. తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సన్నివేశం నెట్ లో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో పవన్ ను తలపై బలంగా కర్రతో కొడుతున్నట్లు ఉంది.

ఇది సినిమాలో క్లైమాక్స్ ఫైట్ అని తెలుస్తోంది. గతంలో కూడా పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఇలానే కొన్ని సన్నివేశాలు బయటకు వచ్చేశాయి. ఇప్పుడు ఈ వీడియో ఎవరు తీశారనే దానిపై దృష్టి పెట్టారు. వెంటనే వారిపై చర్యలు తీసుకొనున్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా చేశారు.