‘కాటమరాయుడు’ ప్లాన్ మారింది!

పవన్ కల్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఫ్యాక్షన్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే పాటల షూటింగ్ కోసం చిత్రబృందం విదేశాలకు వెళ్లనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఉగాది కానుకగా సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

అయితే ఇప్పుడు వారు తమ ప్లాన్ ను మార్చుకున్నట్లు టాక్. ముందుగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వస్తే ఫిబ్రవరి అంతా సినిమాలు ఉన్నాయి. పోనీ మార్చిలో విడుదల చేద్దామంటే పరీక్షలు అడ్డు. మార్చి చివరి వారానికి ఎలాగో పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి అనుకున్న డేట్ కంటే వారం రోజులు ముందే రావాలని ఆలోచన చేస్తున్నారు.

ఇప్పటికే సినిమా బిజినెస్ జోరుగా నడుస్తోంది. సినిమాకు సెకండ్ హాఫ్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అందుకే రేట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదని టాక్.