Homeతెలుగు Newsకేసీఆర్ ఫాంహౌస్‌లో మహాయాగం

కేసీఆర్ ఫాంహౌస్‌లో మహాయాగం

13 10తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం సంప్రదాయబద్ధంగా సాగుతోంది. రెండోరోజు యాగంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సహస్ర చండీయాగానికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ నుంచి వచ్చిన 300 మందికిపైగా రుత్వికులు, వేద మంత్రాలు, వేద పారాయణాలతో ఎర్రవల్లి ఫాంహౌస్ ప్రతిధ్వనిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ యాగం చేస్తున్నారు. ప్రజలు క్షేమంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని రుత్వికులు పూజలు చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని.. దేశ పౌరులకు సుపరిపాలన అందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఐదు రోజుల పాటు ఈ యాగం జరుగుతుంది. శుక్రవారం పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. కేసీఆర్ గతంలోనూ ఇలాంటి మహాయాగాలు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!