HomeTelugu Trendingరానాకు నో చెప్పిన కీర్తి సురేశ్‌

రానాకు నో చెప్పిన కీర్తి సురేశ్‌

9 11టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో కీర్తి సురేశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. స్టార్ హీరోలతో చేసిన సినిమాలు వరుస విజయాలను సాధిస్తూ రావడంతో ఆమె క్రేజ్ పెరుగుతూ వెళ్లింది. ‘మహానటి’కి ముందు గ్లామర్ పరంగానే యూత్ ను ఆకట్టుకున్న ఆమె, ఆ తరువాత నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి ఆమె కథల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.

ఈ నేపథ్యంలోనే రానా సినిమాలోనూ చేయడానికి ‘నో’ చెప్పేసిందట. రానా హీరోగా ఒక సినిమా చేయడానికి నందినీ రెడ్డి సిద్ధం అవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ, ఒక కొరియన్ చిత్రానికి రీమేక్ అట. ఈ సినిమా తెలుగు రైట్స్ ను తీసుకున్నది రానానే. ఆయన జోడీగా కీర్తి సురేశ్ ను సంప్రదించగా ఆమె ‘నో’ చెప్పేసిందట. దీనికి కారణం, ఆమెకు కథ నచ్చకపోవడమా? లేక డేట్స్ సర్దుబాటు కాకపోవడమా? అన్నది తెలియలేదు. దీంతో ఇప్పుడు నందినీ రెడ్డి మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!