మెగాభిమానులకు గుడ్ న్యూస్!

చిరు రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే సినిమాపై కొందరు కావాలనే నెగెటివ్ టాక్ ను ప్రచారం చేస్తుంది. చిరంజీవి మాత్రం ఔట్ పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే అసలు సినిమా టాక్ ఏంటో..? బయటకు వచ్చింది. చిరు అభిమానులకు నచ్చే విధంగా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడిగా వినాయక్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.

చిరు తన చరిష్మాతో సినిమాను ఓ రేంజ్ కు తీసుకువెళ్లాడట. సినిమాలో చిరు ఎంట్రీ సీన్, మూడు పాటలు, ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకు హైలెట్స్ గా చెబుతున్నారు. పోసాని కృష్ణమురళి తనదైన పంచ్ లతో ఆకట్టుకుంటాడట. బ్రహ్మానందం కామెడీ లో పస లేదని అంటున్నారు. చిరు మాత్రం తన స్టెప్పులు, ఫైట్స్ తో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసేశాడట. చిరుని తెరపై చూడాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.