HomeTelugu Trendingరామబాణం నుండి విడుదలైన హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌

రామబాణం నుండి విడుదలైన హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌

dimple hayati from rama ban
టాలీవుడ్ హీరో గోపీచంద్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘రామబాణం’. గోపీచంద్‌ 30వ సినిమాగా తెరెక్కెకుతున్న ఈమూవీకి శ్రీవాసు దర్శకత్వం వహిస్తున్నాడు. వీరి కాంబినేషన్‌లో ఇది 3వ సినిమా. ఈ సినిమాలో హైదరాబాదీ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తుంది. భైరవి పాత్ర పోషిస్తోంది డింపుల్ హయతి.

తాజాగా మేకర్స్ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. హీరోయిన్‌ ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. క్యూట్‌ లుక్‌లో ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని వస్తున్న స్టిల్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.ఈ సినిమా డింపుల్ భైరవి పాత్రలో నటిస్తుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఖుష్బూ సుందర్‌, జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్‌, నాజర్‌, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్‌, సప్తగిరి, కాశీ విశ్వనాథ్‌, సత్య, గెటప్‌ శ్రీను, సమీర్‌, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడులైన గోపీచంద్‌ ఫస్ట్‌లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

మరోవైపు గోపీచంద్‌ కన్నడ దర్శకుడు ఏ హర్ష డైరెక్షన్‌లో గోపీచంద్ 31 కూడా లాంఛ్ చేశాడు. ఔట్ అండ్ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకుంది.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu