పవన్ కు కొత్త అత్త..!

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఓ పవర్ ఫుల్ అత్త క్యారెక్టర్ ఉందని వార్తలు వినిపించాయి. దీనికోసం మొదటగా నదియాను అనుకున్నప్పటికీ అత్తారింటికి దారేది సినిమాతో పోలుస్తారనే ఆలోచనతో మరో నటిని తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆ పాత్ర కోసం కుష్బూను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఆమె తెలుగులో నటించిన దాదాపు తోమిదేళ్లు దాటుతోంది.

త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తన క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పారు. నా గత సినిమా చిరంజీవి గారి చేసిన స్టాలిన్.. ఇప్పుడు మళ్ళీ ఆయన తమ్ముడు సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం సంతోశంగా ఉందని చెప్పారు. తెలుగులో నటించాలనే నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. అలానే తమిళంలో కూడా.. ఇకపై నా అభిమానులను
నిరుత్సాహపరచను అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.