HomeTelugu Trending'నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Kiran Abbavaram Nenu meeku

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. కోడి దివ్య నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సంజనా ఆనంద్ పరిచయం కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని .. సమయాన్ని ప్రకటించారు.

ఈ నెల 10వ తేదీన ఉదయం 11:05 నిమిషాలకు ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. వరుసగా రెండు ఫ్లాపులు చూసిన కిరణ్, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!