ఆదిపురుష్‌పై అభిమానుల్లో టెన్షన్!


ప్రభాస్ తాజా చిత్రం ఆదిపురుష్‌పై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఆదిపురుష్ మూవీ ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

ఆది పురుష్ మూవీలో సీత చిన్నప్పటి ఘటనలను చూపించబోతున్నారట. అయితే సీత తండ్రి జనకమహారాజు పాత్రలో సీనియర్ నటుడు కృష్ణంరాజు కనిపిస్తున్నారు. జనక మహారాజుతో సీతకు ఉండే అనుబంధాన్ని స్క్రీన్‌పై చూపబోతున్నారు. ఈ పాత్రకు చాలామందిని పరిశీలించినప్పటికీ కృష్ణంరాజు మాత్రమే కరెక్ట్ అని ఓం రౌత్ నిర్ణయించారట. ఆదిపురుష్ మూవీలో ఎక్కువగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలాఉంటుంది.

బ్రహ్మస్ర్త ట్రైలర్ వచ్చాక బాలీవుడ్ మూవీస్‌లో గ్రాఫిక్స్ వర్క్‌పై అభిమానుల్లో నమ్మకం కాస్త తగ్గింది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా చీప్‌గా ఉన్నాట్టు కామెంట్స్ వచ్చాయి రాధేశ్యామ్ క్లైమాక్స్ లోనూ గ్రాఫిక్స్ వర్క్ దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. అయితే ఆదిపురుష్‌లో ఎలా ఉండబోతుందోనని అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates