నాని తాగి నటించాడు: కోన వెంకట్

నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ కలిసి నటించిన ‘నిన్ను కోరి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నాని కెరీర్ ఈ సినిమా మరొక సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఈ చిత్ర స్క్రీన్ ప్లే రైటర్ కోన వెంకట్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కథను నాని ఎంతగానో నమ్మాడని ఆ నమ్మకం ఇప్పుడు నిజమైందని వెల్లడించిన కోన నాని తాగి నటించాడనే విషయాన్ని బయటపెట్టాడు. ఈ సినిమా కోసం అమెరికాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో అక్కడ వాతావరణం జీరో డిగ్రీలకు పడిపోయింది. పల్లవి, ఉమ, అరుణ్ అనే పాత్రల చుట్టూ ఓ ముఖ్యమైన సీన్ ఉంటుంది.

ఉమా(నాని) మధ్యం సేవించి ఈ అమ్మాయిలు అసలు అర్ధం కారు బాసూ.. అన్ని అలవాట్లు ఉన్న వారిని ప్రేమిస్తారు. ఏ అలవాటు లేని వారిని పెళ్లి చేసుకుంటారు అనే డైలాగ్ ఫీల్ రావడం కోసం నాని ఫుల్ బాటిల్ మధ్యం సేవించాడట. నాని తాగడంతో మొదట కంగారూ పడ్డా.. అతడికి నేచురల్ స్టార్ అని పేరు రావడం కారణం ఇదేనేమో.. అంత సహజంగా సన్నివేశంలో నటించాడని కోన వెల్లడించారు.