
టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పారు. ఇప్పటి వరకూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంబంధించిన వివరాలు తెలియజేస్తుండేవారు. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నా అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ‘‘నా సినిమాలు, నాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నా. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా. మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటా. మీడియం మారింది కానీ మన మధ్య బంధంలో ఎలాంటి మార్పు ఉండదు’’ అని కొరటాల శివ పేర్కొన్నారు. ప్రస్తుతం కోరాటాల మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. రష్మిక ఆయనకు జంటగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, లుక్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.













