క్రిష్ ఈసారి థ్రిల్లర్ ఎంచుకున్నాడు!

దర్శకుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. తను తెరకెక్కించిన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉంటుంది. ఏ సినిమాకు అదే అన్నట్లుగా ఉంటుంది. గమ్యం సినిమా నుండి శాతకర్ణి సినిమా వరకు ఆయన ప్రయాణాన్ని గనుక పరిశీలిస్తే టచ్ చేసిన జోనర్ ను మళ్ళీ టచ్ చేయలేదు. ఇప్పుడు తన తదుపరి సినిమా విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నారు. అందుకే ఇప్పటివరకు తను టచ్ చేయని థ్రిల్లర్ జోనర్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవల క్రిష్ తన తదుపరి చిత్రం హీరో వెంకటేష్ తో ఉంటుందని వెల్లడించారు. ఇది కాస్త వైవిధ్యమైన సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ వర్క్ కూడా చేయబోతున్నట్లు సమాచారం. వెంకీకు కూడా ఈ కథ కొత్తగా అనిపించడంతో తన 75వ సినిమాగా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటివరకు క్రిష్ చేసిన ప్రతి సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మరి ఈ థ్రిల్లర్ జోనర్ కు ఎలాంటి అప్రిసియేషన్ వస్తుందో.. చూడాలి!