151 క్రిష్ చేతుల్లోకి..?

చిరంజీవి దాదాపు పదేళ్ళ తరువాత ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత చిరు 151 వ సినిమా కూడా లైన్లో పెట్టేశాడు. ఈ చిత్రాన్ని కూడా తన బ్యానర్ లోనే సినిమా ఉంటుందని చరణ్ ఇదివరకే ప్రకటించేశాడు. ఇప్పటివరకు ఈ సినిమాను డైరెక్ట్ చేసేది బోయపాటి శ్రీను అని, కాదు కాదు సురేందర్ రెడ్డి అని రకరకాల వార్తలు వినిపించాయి.

సురేందర్ రెడ్డితో అయితే చిరు సినిమా ఖాయం కానీ ఆ సినిమా పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా చిరు 151 వ సినిమా క్రిష్ తో చేయించాలని చిరు అండ్ కో ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దీని గురించి క్రిష్ తో మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. చిరుతో క్రిష్ సినిమా దాదాపు ఫైనల్ అయినట్లే అనే టాక్ మొదలైంది. మరి క్రిష్, చిరుని ఏ విధంగా ప్రెజంట్ చేస్తాడో.. చూడాలి!