‘వినయ విధేయ రామ’కు ‘కేటీఆర్’ చీఫ్ గెస్ట్

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నది. ఈ సినిమాలో ఇప్పటి వరకు రెండు సింగిల్స్ రిలీజ్ చేశారు. రేపటితో షూటింగ్ పూర్తి అవుతున్నది. కాగా, ఈనెల 27 వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను యూసఫ్ గూడాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారు.

ఈ వేడుకకు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ తో పాటు ఈ ఈవెంట్ లో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ‘కేటీఆర్’ కూడా వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని డివివి సంస్థ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.