టాప్ డైరెక్టర్స్ కలిసి పనిచేయబోతున్నారు!

ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో మొదటి స్థానంలో ఉన్న రాజమౌళి, అలానే మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి శ్రీను, ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకునే దర్శకుడు క్రిష్ కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారు. అది సినిమా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ ముగ్గురు కలిసి పని చేయబోయేది ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కోసమని టాక్. అమరావతి డిజైన్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమౌళి సహాయం కోరినట్లు తెలుస్తోంది.

అలానే క్రిష్, బోయపాటి శ్రీనులను కూడా దీనికోసం కలిసి పని చేయమని అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. లండన్ కు చెందిన ప్రముఖ డిజైనర్ నార్మన్ ఫాస్టర్ తో కలిసి పని చేయడానికి రాజమౌళి అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఈ డిజైనింగ్ లో కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం.