చంద్రబాబు స్కెచ్‌లో భాగమేనట..!

సర్వే పేరుతో ఏపీ అసెంబ్లీ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తాయంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే అని.. 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే చంద్రబాబు ఏమంటాడంటే.. గెలుస్తామని లగడపాటి చెప్పాడు అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎంల ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. లగడపాటి ఆంధ్రా ఆక్టోపస్ కాదు… ఎల్లో జలగ! అని విమర్శించారు. లగడపాటి పేరు నారా రాజగోపాల్‌గా మార్చుకోవాలన్నారు.