ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎప్పుడంటే..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఏపీలో తప్ప మిగిలిన అన్ని చోట్ల విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలు జరుగుతుండటం వలన చిత్రాన్ని విడుదలచేయరాదని కొందరు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు కూడా సినిమాను ఏపీలో విడుదల చేసేందుకు ఒప్పుకోలేదు. తాజాగా ఎన్నికలు ముగియడంతో సినిమాను ఏపీలో విడుదల చేయడానికి నిర్మాతలకు అనుమతులు లభించాయి. మే 1న చిత్రం విడుదలకానుంది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.