HomeTelugu Big Stories'లక్ష్య' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘లక్ష్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

lakshya movie release date

టాలీవుడ్‌ యంగ్ హీరో నాగశౌర్య నటించిన 20వ చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీ రిలీజ్ డేట్ ను బుధవారం నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ప్రకటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాను డిసెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగ శౌర్య లుక్, ఆ హెయిర్ స్టైల్, బాణాన్ని ఎక్కు పెట్టిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, సినిమా మీదున్న అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషనల్ కార్యక్రమాలను త్వరలో మొదలు పెడతామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాలో నాగశౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!