HomeTelugu Big Storiesమెగాస్టార్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రామ్‌చరణ్‌

మెగాస్టార్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రామ్‌చరణ్‌

Mega power star Ram Charan

మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ‘చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ మరో ముందడుగు వేసింది. ఇకపై ఈ ట్రస్ట్‌ సేవలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ను సోమవారం ఉదయం చిరంజీవి కుమారుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ `మిష్టర్ చిరంజీవి` ఆవిష్కరించారు. మరిన్ని ప్రాంతాలకు, మరెంతో మందికి చిరు బ్లడ్‌, ఐ బ్యాంక్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు తెలిపారు.

దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి కెరీర్‌, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసేలా ‘కె.చిరంజీవి’ పేరుతో మరో వెబ్‌సైట్‌ని రామ్‌ చరణ్‌ ప్రాంభించారు.

చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు, పాటలు, దర్శకనిర్మాతలతో ఆయనకున్న సత్సబంధాల గురించి ఈ వెబ్‌సైట్‌లో సమాచారం ఉంచామని చరణ్‌ వివరించారు. మరోవైపు తమ అభిమాన నటుడు రామ్‌చరణ్‌ని చూసేందుకు ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu